Mukesh Rishi Fires Back at AR Rahman’s Remarks: ఏఆర్ రహమాన్ వ్యాఖ్యలపై ముఖేష్ రిషి ఫైర్.. దేవుడు అన్నీ ఇచ్చాక కూడా ఫిర్యాదులు ఎందుకని కామెంట్..

దేవుడు అన్నీ ఇచ్చాక కూడా ఫిర్యాదులు ఎందుకని కామెంట్..

Update: 2026-01-28 09:25 GMT

Mukesh Rishi Fires Back at AR Rahman’s Remarks: ఆస్కార్ గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విలక్షణ నటుడు ముఖేష్ రిషి తీవ్రంగా స్పందించారు. రహమాన్ వంటి స్థాయి ఉన్న వ్యక్తి పని గురించి లేదా అవకాశాల గురించి ఫిర్యాదు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ముఖేష్ రిషి ఏమన్నారంటే?

"దేవుడు మీకు అపారమైన కీర్తిని, అవకాశాలను ఇచ్చినప్పుడు.. నాకు ఏమీ రావడం లేదని ఫిర్యాదు చేయడం భావ్యం కాదు. రహమాన్ తన స్థాయిని ఒకసారి ఆలోచించుకోవాలి" అని ఆయన అన్నారు. చిత్ర పరిశ్రమలోకి ఏటా ఎంతోమంది ప్రతిభావంతులు వస్తారని, ఒక్కోసారి ప్రతిభ ఉన్నా పని దొరక్కపోవచ్చని.. ఇది ఇండస్ట్రీలో సహజమని పేర్కొన్నారు. అది నటుడైనా, సంగీత దర్శకుడైనా అందరికీ వర్తిస్తుందని చెప్పారు.

గత ప్రస్థానం

గత 20-25 ఏళ్లుగా రహమాన్ ఎన్నో అద్భుతమైన హిట్లు ఇచ్చారని, ఆయన సంగీతాన్ని ప్రపంచమంతా ప్రేమిస్తోందని.. ఈ విషయాన్ని ఆయన మర్చిపోకూడదని ముఖేష్ రిషి గుర్తుచేశారు.

Tags:    

Similar News