Dhanush’s ‘Kaara’: ఏప్రిల్ 30న ధనుష్ ‘కార’ రాక: తెలుగు రిలీజ్ డేట్ ఖరారు!
తెలుగు రిలీజ్ డేట్ ఖరారు!
Dhanush’s ‘Kaara’: తమిళ స్టార్ హీరో ధనుష్‌కు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'రఘువరన్ బి.టెక్', 'సార్' వంటి సినిమాలతో ఇక్కడ మంచి మార్కెట్ సంపాదించుకున్న ఆయన, ఇప్పుడు ‘కార’ అనే కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 30, 2026న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విగ్నేష్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాను విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఆర్ స్టార్ లాజిస్టిక్స్ సంస్థలు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాయి. సి.హెచ్. సతీష్ కుమార్, రాజేష్ కుమార్ బొబ్బర ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
ఈ సినిమాలోని "కన్నమ్మ నా కన్నమ్మ" అనే సాంగ్ తెలుగు వర్షన్ ఇప్పటికే యూట్యూబ్‌లో 4.1 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సూపర్ హిట్ అయ్యింది. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ధనుష్ సరసన మమితా బైజూ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే జయరాం, కె.ఎస్. రవికుమార్, కరుణాస్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ధనుష్ గత సినిమాలు తెలుగులో మంచి విజయాలు సాధించడంతో, ఈ ‘కార’ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. సమ్మర్ కానుకగా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.