Dhee Movie Team: ఢీ.. రీ రిలీజ్ రేపే

రీ రిలీజ్ రేపే;

Update: 2025-06-05 05:32 GMT

 Dhee Movie Team:కొత్త సినిమాల సంగతి పక్కన పెడితే ప్రస్తుతానికి టాలీవుడ్‌‌‌‌లో రీ రిలీజ్‌‌‌‌ల ట్రెండ్ నడుస్తోంది. హీరోలు తమ కెరీర్‌‌‌‌‌‌‌‌లోని సూపర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌‌‌‌లో జోష్‌‌‌‌ని నింపుతున్నారు. లేటెస్ట్ గా మంచు విష్ణు, జెనీలియా జంటగా నటించిన ఢీ మూవీని రేపు ( జూన్ 6) విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది మూవీ టీం

2007లో శ్రీనువైట్ల డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో శ్రీహరి , బ్రహ్మానందం కామెడీ, సునీల్ ట్రాక్‌‌‌‌ను ఆడియెన్స్‌‌‌‌ ఎంతగానో ఎంజాయ్ చేశారు. ఆద్యంతం సరదాగా సాగుతూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచేలా చేసింది. ఇది వెంకీ మూవీ తర్వాత శ్రీను వైట్ల నుంచి వచ్చిన సూపర్ హిట్ కామోడీ సినిమా.

విష్ణు కెరీర్‌‌‌‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌‌‌‌గా నిలిచింది ఢీ. రీ రిలీజ్‌‌‌‌లోనూ మంచి వసూళ్లను రాబడుతుందని భావిస్తున్నారు. మరోవైపు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన కన్నప్ప చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది

Tags:    

Similar News