‘Dhurandhar 2’ : పుష్ఫ2 బ్రేక్..టాప్-3లో ‘ధురంధర్-2’

టాప్-3లో ‘ధురంధర్-2’

Update: 2026-04-20 04:37 GMT

‘Dhurandhar 2’ : ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట మొదలైంది! బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్-2’ చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రోజురోజుకూ ఈ సినిమా సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తూ, భారతీయ సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటుతోంది. తాజాగా ఈ చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత అరుదైన ఫీట్‌ను నమోదు చేసి, ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

తాజా లెక్కల ప్రకారం.. ‘ధురంధర్-2’ అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ చిత్రాల జాబితాలో టాప్-3 స్థానానికి దూసుకెళ్లింది. ఇప్పటివరకు 1,742 కోట్ల రూపాయలతో మూడో స్థానంలో ఉన్న ‘పుష్ప-2’ రికార్డును రణ్‌వీర్ సింగ్ బద్దలు కొట్టారు. ఏకంగా 1,748 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో అల్లు అర్జున్ సినిమాను వెనక్కి నెట్టి, ధురంధర్-2 తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా కంటే ముందు కేవలం రెండు చిత్రాలు మాత్రమే ఉన్నాయి. 2,090 కోట్లతో ‘దంగల్’ అగ్రస్థానంలో ఉండగా, 1,788 కోట్లతో ‘బాహుబలి-2’ రెండో స్థానంలో కొనసాగుతోంది.

అయితే ‘ధురంధర్’ సిరీస్ మరో అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకుంది. భారతీయ సినిమా చరిత్రలోనే 3,000 కోట్ల రూపాయల గ్రాస్ మార్కును దాటిన తొలి ఫ్రాంచైజీగా ‘ధురంధర్’ సరికొత్త చరిత్ర సృష్టించింది. మొదటి భాగం, ఇప్పుడు రెండో భాగం కలిపి వసూళ్ల పరంగా భారతీయ వెండితెరపై మరే సినిమా సిరీస్‌కూ సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ వసూళ్లు చూస్తుంటే రణ్‌వీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేయడమే కాకుండా, బిగ్గెస్ట్ స్టార్‌గా అవతరించారని స్పష్టమవుతోంది.

ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ‘ధురంధర్-2’ త్వరలోనే ‘బాహుబలి-2’ రికార్డును కూడా క్రాస్ చేసేలా కనిపిస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్రం 1,800 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. మరి ఈ సినిమా ‘దంగల్’ ఆల్-టైమ్ రికార్డును కూడా బ్రేక్ చేస్తుందో లేదో వేచి చూడాలి!

Tags:    

Similar News