“Dhurandhar” Breaks Baahubali 2: ధురంధర్ దెబ్బకు బాహుబలి-2 రికార్డ్ బద్దలు..నెక్స్ట్ టార్గెట్ దంగల్!

నెక్స్ట్ టార్గెట్ దంగల్!

Update: 2026-04-24 10:58 GMT

“Dhurandhar” Breaks Baahubali 2: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఒకటే పేరు మారుమోగుతోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన 'ధురంధర్-2' ప్రభంజనం సృష్టిస్తోంది. కేవలం థియేటర్లను నింపడమే కాదు.. కాసుల వర్షం కురిపిస్తూ భారతీయ సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిచెబుతోంది. ఈ సినిమా సృష్టించిన సునామీకి అగ్ర హీరోల రికార్డులు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి.

తాజాగా ధురంధర్-2 ఒక చారిత్రాత్మక ఘనతను సొంతం చేసుకుంది. ఇన్నాళ్లూ తిరుగులేని రికార్డుగా ఉన్న దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన 'బాహుబలి-2' వసూళ్లను ఈ చిత్రం అధిగమించింది. రూ. 1,810 కోట్ల వసూళ్లతో ఇన్నేళ్లు రెండో స్థానంలో ఉన్న బాహుబలి-2 రికార్డును మట్టికరిపిస్తూ.. ఇప్పటివరకు రూ. 1,812 కోట్లను రాబట్టింది ధురంధర్-2. దీంతో భారత చలనచిత్ర రంగంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా రికార్డులకెక్కింది.

ఇక ధురంధర్-2 కన్ను ఇప్పుడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ 'దంగల్' రికార్డుపై పడింది. రూ. 2 వేల కోట్లకు పైగా వసూళ్లతో దంగల్ ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ధురంధర్-2 ఇంకా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుండటం.. ప్రేక్షకుల నుంచి ఆదరణ తగ్గకపోవడంతో, అతి త్వరలోనే ఈ చిత్రం 2 వేల కోట్ల మార్కును దాటి దంగల్ రికార్డును కూడా బద్దలు కొట్టడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కేవలం కథా బలంతోనే కాకుండా, మేకింగ్ వాల్యూస్, నటీనటుల అద్భుత నటనతో ధురంధర్-2 ఈ స్థాయి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ధురంధర్-2 ప్రయాణం ఇంకా ముగియలేదు.. కలెక్షన్ల సునామీ కొనసాగుతూనే ఉంది. మరి ఈ చిత్రం ఇండియన్ సినిమా హిస్టరీలో నంబర్ వన్ స్థానాన్ని ఎప్పుడు కైవసం చేసుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News