Spirit Movie: స్పిరిట్ సినిమా విషయంలో దీపిక అతి చేసిందా?
దీపిక అతి చేసిందా?;
Spirit Movie: స్పిరిట్ సినిమాలో నటించే అవకాశాన్ని దీపికా పదుకొణె కోల్పోయిన విషయం తెలిసిందే. భారీ మొత్తంలో రెమ్యూనరేషన్, లాభాల్లో షేర్, ఇతరత్రా డిమాండ్లు పెట్టడంతో దర్శకుడు సందీప్ వంగా ఆమెను నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని కుండబద్దలు కొట్టాడు. దీంతో నటి పీఆర్ టీమ్ ఆ సినిమాపై ఆక్రోశం వెల్లగక్కింది. ఇదేం సినిమా.. ఇందులో నటించకపోతే నష్టం ఏంటి? అంటూ రియాక్ట్ అయింది. కానీ పీఆర్ టీమ్ పెయిడ్ ఆర్టికల్స్ రాయించిందని ఆ తర్వాత బయట పడింది. ఒక సినిమాలో అవకాశం కోల్పోతే మరో సినిమాలో అవకాశం కోసం చడీచప్పుడు కాకుండా వేరే ప్రాజెక్టులు వెతుక్కుంటారు. అంతేగానీ అవకాశం లభించని సినిమా గురించి తక్కువ చేసి మాట్లాడరు. బాలీవుడ్లో అగ్ర కథానాయికగా, అత్యధిక పారితోషిక అందుకుంటున్న హీరోయిన్ గా పీఆర్ ప్రకట నలకు మద్దతుగా నిలవడం ఆమె చేసిన అతిగా విమర్శకులు భావిస్తున్నారు. ఇప్పటికైనా ఆమె పీఆర్ ను కంట్రోల్లో పెట్టడం ద్వారా జరిగిన డ్యామేజీని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. ఇక దీపికా రూ.25 కోట్లు డిమాండ్ చేయడంపై కబీర్‌ఖాన్ తన అభిప్రాయాన్ని తెలిపారు. ప్రేక్షకాదరణ ఉన్న నటీనటులు ఎవరైనా తగిన పారితోషికానికి అర్హులేనన్నారు. వ్యక్తులను చూసి కాకుండా వారికి ఉన్న స్టార్డమ్ చూసి రెమ్యూనరేషన్ ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీపికా ప్రాజెక్ట్‌పై వస్తోన్న వార్తల గురించి ఆమె స్పందించకపోయినప్పటికీ బాలీవుడ్ తారలు ప్రత్యక్షంగా పరోక్షంగా.. వేదికపై, ఇంటర్వ్యూల్లోనూ దీని గురించి మాట్లాడుతున్నారు.