Former Miss India Manasa Varanasi: సంతోష్ శోభన్ సరసన 'కపుల్ ఫ్రెండ్లీ' చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మాజీ మిస్ ఇండియా మానస వారణాసి ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ఈ సినిమాలో ప్రాణాంతక వ్యాధితో పోరాడే మధ్యతరగతి అమ్మాయిగా ఆమె కనబరిచిన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. స్వయంగా రెబల్ స్టార్ ప్రభాస్ వంటి అగ్ర హీరోలు కూడా ఆమె నటనను మెచ్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమెకు వరుసగా పెద్ద నిర్మాణ సంస్థల నుండి ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం.

అయితే, ఇటీవల ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత తన కుమారుడి సరసన నటించాల్సిందిగా మానసను కోరగా, ఆమె ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు ఫిల్మ్ నగర్ టాక్. సదరు సినిమాలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. కేవలం పాటలకే పరిమితమయ్యే పాత్రలు లేదా గ్లామర్ కోసమే ఉండే రోల్స్ కాకుండా, నటనకు స్కోప్ ఉన్న పాత్రలనే ఎంచుకోవాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం.

తొలి సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా, 'కపుల్ ఫ్రెండ్లీ'తో తనలోని ప్రతిభను నిరూపించుకున్న మానస.. కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రల ద్వారానే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని భావిస్తోంది. గ్లామర్ రోల్స్ అయినా, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలైనా సరే, స్క్రీన్ మీద తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఆమె కోరుకుంటోంది. ఒక పెద్ద బ్యానర్ మరియు స్టార్ కిడ్ సినిమా అయినప్పటికీ, కేవలం 'డెకరేటివ్' పాత్ర కాకూడదనే ఉద్దేశంతో ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Tags: