Sreeleela: అఖిల్ కు హ్యాండ్ ఇచ్చిన శ్రీలీల?

హ్యాండ్ ఇచ్చిన శ్రీలీల?;

Update: 2025-06-25 14:54 GMT

Sreeleela: టాలీవుడ్ యువ హీరో అక్కినేని వారసుడు అఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తున్న ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్తో పాటు సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, నాగ వంశీ సంయు క్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్న విడుదల చేయగా.. రూరల్ బ్యాక్ ప్ల రాబోతున్న ఈ గ్లింప్స్ ఆకట్టుకుంది.

మొదట ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల ఖరారైన ట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ మూవీ నుంచి ఆమె తప్పుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్లోనూ కొత్త మూవీస్ చేస్తోంది. చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్న కారణంగా డేట్స్ కేటాయించడం కష్టంగా మారడంతో అఖిల్ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఈ వార్తలు నిజమైతే, శ్రీలీల స్థానంలో మరోహీరోయిన నన్ను వెతికే పనిలో చిత్రబృందం ఉందని తెలుస్తోంది. 

Tags:    

Similar News