Akhil Lenin Impresses Fans: తప్పిపోయి రాలేదు మచ్చా.. వెతుక్కుంటూ వచ్చా.. అఖిల్ లెనిన్ నుంచి అదిరిపోయే టీజర్..
అఖిల్ లెనిన్ నుంచి అదిరిపోయే టీజర్..
Akhil Lenin Impresses Fans: అక్కినేని యువ హీరో అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా మోస్ట్ అవేటెడ్ చిత్రం లెనిన్. వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ దర్శకుడు మురళీకిశోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మకె ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రానికి సంబంధించి అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న క్రేజీ అప్‌డేట్‌ను చిత్రబృందం శనివారం నాడు విడుదల చేసింది. టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి విజయవంతంగా 40 ఏళ్లు పూర్తయిన అరుదైన సందర్భాన్ని పురస్కరించుకుని.. లెనిన్ అఫీషియల్ టీజర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.
రాయలసీమ యాసలో అఖిల్ రచ్చ..
తాజాగా విడుదలైన లెనిన్ టీజర్ ఇంటర్నెట్‌లో విపరీతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఈ వీడియోలో అఖిల్ మునుపెన్నడూ చూడని సరికొత్త,ఎ ఊరమాస్ లుక్‌లో కనిపించి సర్ప్రైజ్ చేశారు. టీజర్‌లో అఖిల్ చెప్పిన వన్-లైనర్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా.. మనోడు వస్తున్నాడు.. అనే ఎలివేషన్ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో పాటు, అఖిల్ బేస్ వాయిస్‌తో చెప్పిన నేను తప్పిపోయి రాలేదు మచ్చా.. మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చా అనే డైలాగ్ థియేటర్లలో ఈలలు వేయించేలా ఉంది. టీజర్‌లో హీరోయిన్‌తో అఖిల్ కెమిస్ట్రీ, రొమాంటిక్ సీన్లు క్లాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. వీటికి తోడు అఖిల్ మొదటిసారి పక్కా రాయలసీమ యాసలో పలికిన.. యాడికమ్మీ పోతుండావు.. ఈరోజు అటో ఇటో తేల్చేద్దామూ అనే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.
కింగ్ నాగార్జున ఎమోషనల్ ట్వీట్:
ఈ చారిత్రాత్మక మైల్‌స్టోన్ రోజున తన కొడుకు సినిమా టీజర్ విడుదల కావడంపై కింగ్ నాగార్జున సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ టీజర్‌ను అభిమానులతో పంచుకుంటూ.."నా ఇండస్ట్రీ 40 ఏళ్ల వేడుక వేళ చిత్రబృందం నాకు చాలా మంచి సర్‌ప్రైజ్ ఇచ్చింది" అంటూ లెనిన్ టీమ్‌ను అభినందించారు. టీజర్ చూస్తున్నంతసేపు చాలా ఎనర్జిటిక్‌గా, హాయిగా అనిపించిందని ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు.
జూన్ 26న గ్రాండ్ రిలీజ్..
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ల వేగాన్ని చిత్రబృందం మరింత పెంచింది. అన్ని కమర్షియల్ హంగులతో రూపొందుతున్న లెనిన్ చిత్రాన్ని వచ్చే నెల 26న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.