Director Vamsi Paidipally: టాలీవుడ్ డైరెక్టర్‌తో సల్మాన్ ఖాన్ నెక్స్ట్ మూవీ.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది!
అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది!
Director Vamsi Paidipally: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన తదుపరి సినిమా గురించి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో సల్మాన్ తన కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏప్రిల్ నెల నుండే ప్రారంభం కానుంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "దిల్, దిమాగ్, జిగర్ సే.. ఈ ఏప్రిల్ నుండి @directorvamshi మరియు #DilRajuతో మొదలుపెడుతున్నాం" అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వంశీ పైడిపల్లితో కలిసి దిగిన ఒక ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. దక్షిణాది దర్శకుడు, నిర్మాతతో కలిసి సల్మాన్ ఖాన్ సినిమా చేస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
దర్శకుడు వంశీ పైడిపల్లికి తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు ఉంది. ఆయన గతంలో ప్రభాస్‌తో 'మున్నా', ఎన్టీఆర్‌తో 'బృందావనం', రామ్ చరణ్ - అల్లు అర్జున్‌లతో 'ఎవడు', నాగార్జున - కార్తీలతో 'ఊపిరి', మహేష్ బాబుతో 'మహర్షి', మరియు దళపతి విజయ్‌తో 'వారసుడు' వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఇప్పుడు నేరుగా బాలీవుడ్ భాయ్‌జాన్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
గత కొన్నాళ్లుగా బాక్సాఫీస్ వద్ద సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న సల్మాన్ ఖాన్, ఈ సినిమాతో మళ్ళీ తన ఫామ్ లోకి రావాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సల్మాన్ కు గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.