Movie Review: మంటలు రేపే ప్రేమకథ – Do Deewane Seher Mein మూవీ రివ్యూ

సహనాన్ని పరీక్షించే ప్రేమ ప్రయాణం… మనసును మృదువుగా తాకే ముగింపు

Update: 2026-02-23 06:48 GMT

నటీనటులు: Siddhant Chaturvedi, Mrunal Thakur, Ila Arun, Sandeepa Dhar తదితరులు...

దర్శకుడు: Ravi Udyawar

నిర్మాతలు: Sanjay Leela Bhansali, Prerna Singh, Umesh Kumar Bansal, Bharat Kumar Ranga

నిడివి: 2 గంటలు 18 నిమిషాలు

సర్టిఫికేషన్: U/A

విడుదల తేదీ: 20 ఫిబ్రవరి 2026

రేటింగ్: ★★★☆☆ (3/5)

నగర జీవితం-ఒంటరితనం

Do Deewane Seher Mein సినిమా ముంబై నగరంలోని వేగవంతమైన జీవితాన్ని నేపథ్యంగా తీసుకొని సాగుతుంది. ఈ సినిమాలో ఎక్కువ డ్రామా లేదా పెద్ద పెద్ద మలుపులు వుండవు. చిన్న చిన్న భావోద్వేగాలు, నిశ్శబ్ద క్షణాలు, మనసులోని అస్థిరతలను నెమ్మదిగా చూపిస్తుంది. కొన్నిసార్లు ఈ నెమ్మదితనం ఎక్కువగా అనిపించినా, కథలోని భావాన్ని మాత్రం స్పష్టంగా తెలియజేస్తుంది.

కథ

రోష్ని శ్రీవాస్తవ మరియు శశాంక్ శర్మ అనే ఇద్దరు వ్యక్తుల కథ ఇది. తమ జీవితంలో ఆటు పోట్లను ఎదుర్కొంటూ, తమను తాము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ఇద్దరు యువతీ,యువకులు.

శశాంక్‌కు మాట్లాడే సమయంలో వచ్చే ఒక చిన్న సమస్య అతని ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. మరోవైపు రోష్ని తన శరీర ఆకృతి, వ్యక్తిత్వం గురించి లోలోపల ఆందోళన చెందుతూ ఉంటుంది. వీరి మధ్య ప్రేమ ఒక్కసారిగా కాదు, చిన్న చిన్న సంభాషణలు, భావోద్వేగాల ద్వారా క్రమంగా పెరుగుతుంది.

మిలియన్ల జనసందోహం మధ్య కూడా ఒంటరితనం ఎలా ఉంటుందో ఈ సినిమా బాగా చూపిస్తుంది. అయితే మొదటి భాగం చాలా నెమ్మదిగా సాగడం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.

దర్శకత్వం: సహజత్వానికి ప్రాధాన్యం

దర్శకుడు రవి ఉదయవార్ ఈ చిత్రాన్ని చాలా సహజంగా తెరకెక్కించారు. అతిగా మెలోడ్రామా లేకుండా, పాత్రల భావోద్వేగాలను నెమ్మదిగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ విధానం సినిమాకు నిజమైన అనుభూతి తెచ్చినప్పటికీ, కొన్ని సన్నివేశాలు అవసరానికి మించి పొడవుగా అనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్

ఈ సినిమా ఆధునిక సంబంధాల్లో ఉండే సందేహాలు, ఒత్తిడులను చూపిస్తుంది. డేటింగ్ అలసట, కెరీర్ ఆందోళనలు, భావోద్వేగాలను బయటపెట్టడంపై ఉన్న భయం వంటి అంశాలు కనిపిస్తాయి. అయితే సంభాషణల్లో మరింత బలం ఉండి ఉంటే కొన్ని సన్నివేశాలు ఇంకా ప్రభావవంతంగా ఉండేవి. కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వరు.

నటన

సిద్ధాంత్ చతుర్వేది కొంతమేర మితమైన నటనతో ఆకట్టుకుంటారు. మృణాల్ ఠాకూర్ పాత్ర భావోద్వేగానికి కేంద్రంగా ఉంటుంది. అయితే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది.

కానీ రెండో భాగంలో వారి బంధం కొంత బలంగా మారి, మొదటి భాగంలోని నెమ్మదితనాన్ని కొంతమేర మరిచిపోయేలా చేస్తుంది.

తుది తీర్పు

Do Deewane Seher Mein పూర్తిగా లోపరహితమైన ప్రేమకథ కాదు. ఎడిటింగ్ మరింత కట్టుదిట్టంగా ఉండి ఉంటే సినిమా ఇంకా బాగా ఉండేది. మొదటి భాగంలో కథనం కొద్దిగా సడలినట్టు అనిపిస్తుంది.

అయితే వేగంగా నడిచే సినిమాల మధ్య ఇది ఒక స్లో ఎమోషనల్ కథగా నిలుస్తుంది. కాకపోతే సినిమా చూసాక ఒక సున్నితమైన భావం మాత్రం మన మనసును తట్టుతుంది..

Tags:    

Similar News