Hari Hara Veera Mallu Movie: హరి హర వీరమల్లు సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?
ఈ విషయాలు తెలుసా?;
Hari Hara Veera Mallu Movie: పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన "హరి హర వీరమల్లు" సినిమా 2025 జలై 24వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో (సుమారు 250 నుండి 350 కోట్ల రూపాయలు) నిర్మించబడింది. ఇది తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో జూలై 24, 2025న విడుదల కానుంది.
ఈ చిత్రానికి మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ "వీరమల్లు" అనే టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు జ్యోతికృష్ణ, ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి దిగ్గజ నటుల నుండి ప్రేరణ పొంది పవన్ పాత్రను రూపొందించినట్లు వెల్లడించారు. పవన్ శక్తిని, న్యాయం కోసం పోరాటాన్ని, ధర్మాన్ని నిలబెట్టడాన్ని సూచించడానికి విల్లు, బాణాన్ని ఉపయోగించారు. ఈ సినిమా కోవిడ్ మహమ్మారి, పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యకలాపాలు వంటి కారణాలతో పలుమార్లు వాయిదా పడింది. దాదాపు 13 సార్లు విడుదల వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకు జూలై 24న విడుదల కానుంది.
పవన్ కళ్యాణ్ తో పాటు నిధి అగర్వాల్ (పంచమి పాత్రలో), నర్గీస్ ఫక్రి (రోషనారా పాత్రలో), నోరా ఫతేహి, బాబీ డియోల్ (ఔరంగజేబు పాత్రలో), సత్యరాజ్, విక్రమ్‌జిత్ విర్క్, జిషు సేన్‌గుప్తా, దలీప్ తాహిల్ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో ఉంది. .ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇది క్రిష్ జాగర్లమూడితో ఆయన ఐదో సినిమా.
ఈ సినిమా 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఒక కాల్పనిక గజదొంగ వీరమల్లు జీవితాన్ని చిత్రీకరిస్తుంది. "హరి హర" అంటే శివుడు , విష్ణువుల అవతారంగా "వీరమల్లు"ని చూడబోతున్నామని దర్శకుడు వెల్లడించారు. "హరి హర వీరమల్లు"కు సెన్సార్ బోర్డు U/A రేటింగ్‌ను మంజూరు చేసింది. ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 42 నిమిషాలు.