Crazy Update on Varanasi: మహేష్ బాబుకు హిందీ రాదా? రాహుల్ దేవ్ షాకింగ్ కామెంట్స్.. వారణాసిపై క్రేజీ అప్‌డేట్

రాహుల్ దేవ్ షాకింగ్ కామెంట్స్.. వారణాసిపై క్రేజీ అప్‌డేట్

Update: 2026-05-15 12:43 GMT

Crazy Update on Varanasi: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీపై గతంలో చేసిన బాలీవుడ్ నన్ను భరించలేదు అనే వ్యాఖ్య ఇప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్. తాజాగా ఈ విషయంపై విలన్ నటుడు రాహుల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. మరోవైపు, మహేష్ - రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న వారణాసి చిత్రం గురించి అదిరిపోయే అప్‌డేట్స్ బయటకు వచ్చాయి.

మహేష్‌కు భాష రాదు.. రాహుల్ దేవ్ సెటైర్?

ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్ దేవ్, మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఆయనకు హిందీ రాదు.. అందుకే ఆయన బాలీవుడ్ సినిమాల్లో నటించడం లేదు. ఇదే అసలు నిజం" అని రాహుల్ దేవ్ నవ్వుతూ సరదాగా వ్యాఖ్యానించారు. అయితే మహేష్ బాబు హిందీ అనర్గళంగా మాట్లాడగలరని, ఆయన గతంలోనే బాలీవుడ్ ఆఫర్లను ఎందుకు తిరస్కరించారో స్పష్టంగా చెప్పారని అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

2022లో మేజర్ ఈవెంట్‌లో మహేష్ మాట్లాడుతూ.. "బాలీవుడ్ నన్ను భరించలేదు, అక్కడ నటించి నా సమయాన్ని వృథా చేసుకోవాలనుకోవడం లేదు అని అన్నారు. కాగా వారణాసి చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ఉగాది పర్వదినం సందర్భంగా విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. 1400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్న తొలి భారతీయ చిత్రం కావడం విశేషం. ఇందులో మహేష్ బాబు రుద్ర అనే అడ్వెంచరస్ పాత్రలో కనిపించనున్నారు. మహేష్ బాబు బాలీవుడ్ వెళ్లకపోయినా, రాజమౌళి సినిమాతో నేరుగా హాలీవుడ్ స్థాయికి వెళ్తున్నారని ఆయన అభిమానులు గర్వంగా చెబుతున్నారు. రాహుల్ దేవ్ వ్యాఖ్యలపై మహేష్ ఎలా స్పందిస్తారో చూడాలి..

Tags:    

Similar News