మరోసారి సరొకిత్తగా ప్రేక్షకులను అలరించేందుకు వస్తుంది డోంట్ బి షై ! ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ కొత్త అప్‌డేట్ ఇచ్చారు. రాబోయే ప్రైమ్ ఒరిజినల్ చిత్రం ‘డోంట్ బి షై!’ చిత్రానికి సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను ప్రముఖ నటి, నిర్మాత ఆలియా భట్ తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో చిత్రంలోని ప్రధాన పాత్రల అద్భుతమైన కెమిస్ట్రీ, యూత్ పవర్, సహజమైన స్టైల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

చిత్ర విశేషాలు - నటీనటులు

ఈ ప్రేమకథలో ఆరుషి బజాజ్, పియూష్ ఖతి, బియాంకా అరోరా, మరియు అన్ష్ దుగ్గల్ ప్రధాన పాత్రల్లో యువ నటీనటులు నటిస్తున్నారు. ఫ్రెండ్షిప్‌, ఫస్ట్ లవ్‌, అలాగే ఎదుగుతున్న క్రమంలో ఎదురయ్యే అందమైన గందరగోళ ప్రయాణాన్ని ఈ చిత్రం బాగా కనెక్ట్‌ అయ్యే ఎమోషన్స్, సరదాగా చూపించనుంది.

మూవీలో కీలక రోల్స్

శ్రీతి ముఖర్జీ రచన మరియు దర్శకత్వంలో, ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆలియా భట్ మరియు షాహీన్ భట్ నిర్మించగా, గ్రిష్మా షా మరియు వికేష్ భూతాని సహ-నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో కునాల్ రాయ్ కపూర్, అనురాగ్ బసు, నేహా ధూపియా, మరియు అంజు అల్వా నాయక్ కూడా కీలక పాత్రలలో నటించారు.

స్ట్రీమింగ్ వివరాలు

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘డోంట్ బి షై’ చిత్రం సెప్టెంబర్ 25, 2026న ప్రైమ్ వీడియోలో గ్రాండ్‌గా ప్రీమియర్ కానుంది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాలు మరియు భూభాగాలలో హిందీలో ఈ సినిమా ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది.యువతను, కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేసే ఈ కూల్ గ్యాంగ్ ప్రయాణాన్ని తెరపై చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Tags: