Yami Gautam: మా మధ్య చిచ్చు పెట్టొద్దు
చిచ్చు పెట్టొద్దు
Yami Gautam: బాలీవుడ్ హీరోయిన్లు యామీ గౌతమీ, కృతిసనన్ మధ్య సోషల్ మీడియా వేదికగా వివాదం తలెత్తింది. ఇటీవల జరిగిన 'జీ సినీ అవార్డ్' వేడుకలో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కృతి సనన్ ఫొటోను యామీ గౌతమీ లైక్ చేసింది. అయితే దీనిపై నెట్టింట “పెద్ద దుమారమే రేపింది. ఈ వివాదం మరింత ముదురుతుండటంతో తాజాగా యామీ గౌతమీ క్లారిటీ ఇచ్చింది. "నేను మరో నటిని తక్కువ చేసే విధంగా ఉన్న ట్వీట్ ను లైక్ చేశానని నా దృష్టికి వచ్చింది. నిజానికి ప్రతిరోజు మమ్మల్ని వందలాది పోస్టుల్లో ఇలా ట్యాగ్ చేస్తూ ఉంటారు. ఆవార్డు ఫంక్షన్ హడావిడిలో పొరపాటున వీడియోపై క్లిక్ అయి ఉండవచ్చు. అంతే తప్ప కావాలని చేసింది మాత్రం కాదు. నా కెరీర్లో ఎప్పుడూ ఇలాంటి చీప్ టెక్నిక్స్ వాడలేదు నాకు అసలు పీఆర్ టీమే లేదు. అవార్డుల విషయంలో నా ఒపీని, యన్ ఏంటో ఇప్పటికే చాలాసార్లు చెప్పేశాను. నేను ఎవరి మెప్పుకోసమే. గుర్తింపు కోసమో పని చేయడం లేదు. నా పని మీద మాత్రమే నాకు నమ్మకం ఉంది. సోషల్ మీడియాలో వచ్చే గాసిప్స్ నమ్మవద్దు క్లిక్ బైట్ వార్తల కోసం గౌర వపదమైన నటీమణుల మధ్య చిచ్చు పెట్టొద్దు' అంటూ గౌతమీ వివరణ ఇచ్చింది.