Dr. Rajasekhar Reveals Past Proposal to Sridevi: టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మ్యాన్'గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నటుడు డాక్టర్ రాజశేఖర్. వృత్తిరీత్యా డాక్టర్ అయినా, ప్రవృత్తి కోసం వెండితెరను ఎంచుకున్న ఆయన ప్రయాణం ఎంతో సాహసోపేతం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజశేఖర్, తన కెరీర్ , వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

రాజశేఖర్ సినిమాల్లోకి రావడం ఆయన తండ్రికి అస్సలు ఇష్టం లేదట. "డాక్టర్ అయితే ఇంట్లోనే ఉండు.. యాక్టర్ అవ్వాలనుకుంటే ఇంటి నుంచి వెళ్లిపో" అని తండ్రి ఖచ్చితంగా చెప్పడంతో, సినిమాలపై ఉన్న మక్కువతో ఆయన ఇల్లు వదిలి బయటకు వచ్చేశారు.

ప్రేమ- పెళ్లి - శ్రీదేవితో ప్రపోజల్

జీవిత-రాజశేఖర్ జోడీ అంటే టాలీవుడ్‌లో ఒక బ్యూటిఫుల్ కపుల్. "మీ ఇద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారు?" అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఆవిడే ప్రపోజ్ చేసేలా నేను చేశాను అని రాజశేఖర్ నవ్వులు పూయించారు. అంతేకాదు, ఒకప్పుడు అతిలోక సుందరి శ్రీదేవితో తనకు పెళ్లి ప్రపోజల్ వచ్చిందన్న నిజాన్ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే తాను గోటీల ఫ్యాక్టరీ నడుపుతున్నట్లు అప్పట్లో వచ్చిన పుకార్లపై కూడా ఫన్నీగా స్పందించారు.

శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'జెంటిల్ మ్యాన్', విక్టరీ వెంకటేష్ సూపర్ హిట్ చిత్రం 'చంటి' సినిమాల్లో నటించే అవకాశం తనకే ముందు వచ్చిందని, కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలను మిస్ అయ్యానని ఆయన గుర్తుచేసుకున్నారు.

Tags: