Dragon Action: జోర్డాన్‌లో డ్రాగన్ యాక్షన్
డ్రాగన్ యాక్షన్
Dragon Action: ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్‌ను జోర్డాన్ దేశంలో ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం హైదరాబాద్ విమానాశ్రయంలో ఎన్టీఆర్ కనిపించగా, ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ సరికొత్త లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా కోసం తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. గత చిత్రాలతో పోలిస్తే మరింత లీన్ అండ్ రగ్గడ్ లుక్‌లో, ఒత్తైన గడ్డం, స్టైలిష్ హెయిర్ స్టైల్‌తో కనిపించారు. సినిమాలో ఇదే ఆయన ఫైనల్ లుక్ అని తెలుస్తోంది. దాదాపు నెలరోజుల పాటు జోర్డాన్‌లో షూటింగ్ జరగనుండగా, ఈ షెడ్యూల్‌లో హాలీవుడ్ స్థాయి మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్రశాంత్ నీల్ చిత్రీకరించనున్నారు. ఎన్టీఆర్, టొవినో థామస్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలు షూట్ చేయబోతున్నట్టు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఎన్టీఆర్‌కు జంటగా రుక్మిణీ వసంత్ నటిస్తోంది. ఈ ఏడాది జూన్ 25న
సినిమా విడుదల కానుంది.