Drishyam 3 Shooting Begins: దృశ్యం 3 షూటింగ్ షురూ: ప్రకాశ్ రాజ్ ఎంట్రీ.. అక్షయ్ ఖన్నాకు కోర్టు నోటీసులు..

అక్షయ్ ఖన్నాకు కోర్టు నోటీసులు..

Update: 2026-02-11 10:44 GMT

Drishyam 3 Shooting Begins: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ప్రతిష్టాత్మక ఫ్రాంచైజీ. దృశ్యం 3 ఎట్టకేలకు పట్టాలెక్కింది. అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభంలోనే అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అటు కొత్త నటీనటుల రాక, ఇటు పాత నటుల వివాదాలతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఎంట్రీ

ఈ చిత్రంలో సౌత్ వెర్షన్ దృశ్యంలో నటించిన ప్రకాశ్ రాజ్ ఇప్పుడు హిందీ వెర్షన్‌లోనూ భాగమయ్యారు. ఈ అద్భుతమైన ఫ్రాంచైజీలో చేరడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇందులో తానొక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రకాశ్ రాజ్ రాకతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

అక్షయ్ ఖన్నా అవుట్.. జైదీప్ అహ్లావత్ ఇన్

గత భాగంలో కీలక పాత్ర పోషించిన అక్షయ్ ఖన్నా ఈ సీక్వెల్ నుండి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. ఆయన స్థానంలో ఎవరు నటిస్తారనే సస్పెన్స్‌కు నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ తెరదించారు. వర్సటైల్ యాక్టర్ జైదీప్ అహ్లావత్ ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా తరహా పాత్రలో కనిపించబోతున్నారని స్పష్టం చేశారు.

అక్షయ్ ఖన్నాకు లీగల్ నోటీసులు

ఈ సినిమా విషయంలో అక్షయ్ ఖన్నా ప్రవర్తన పట్ల నిర్మాతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అగ్రిమెంట్ చేసుకుని, డేట్స్ ఇచ్చి, అడ్వాన్స్ కూడా తీసుకున్న తర్వాత అక్షయ్ అకస్మాత్తుగా ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. నిర్మాతలు ఫోన్ చేసినా ఆయన స్పందించకపోవడంతో మేకర్స్ చివరకు కోర్టు ద్వారా నోటీసులు పంపారు. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.

రిలీజ్ ఎప్పుడంటే?

వివాదాలు పక్కన పెడితే, సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

Tags:    

Similar News