‘Drishyam’ Goes Spanish: స్పానిష్ లో దృశ్యం..జూన్ లో షూటింగ్

జూన్ లో షూటింగ్

Update: 2026-03-31 14:04 GMT

‘Drishyam’ Goes Spanish: మలయాళ థ్రిల్లర్ మూవీ 'దృశ్యం' ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇప్పటికే తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషలతోపాటు శ్రీలంక, చైనాలోనూ రీమేక్ అయ్యింది. తాజాగా ఈ చిత్రాన్ని స్పానిష్ లో తెరకెక్కించనున్నట్లు నిర్మాత రోడ్రిగో ఎస్పినెల్ ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్ లో వెల్లడించారు. 'ఇదొక ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఎందుకంటే నా భాగస్వామి ఒక మెక్సికన్ నిర్మాత. ఆయన ఐపీ హక్కులను కొనుగోలు చేశారు. స్పెయిన్లో అద్భుతమైన పన్ను ప్రోత్సాహకాలు ఉండటంతో ఆయనే మమ్మల్ని సంప్రదించారు. స్పానిష్ కల్చర్ కు అనుగుణంగా మార్పులు చేస్తం. జూన్లో షూటింగ్ ప్రారంభిస్తం. ఈ ప్రాజెక్టులో స్పానిష్ దర్శకుడు, అగ్రశ్రేణి స్పానిష్ నటీనటులు ఉన్నారు' అని తెలిపారు.

ఇక మోహన్లా ల్ హీరోగా నటించిన దృశ్యం 3 మే 21న విడుదల కానుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన దృశ్యం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు మూడో భాగం అలరించేం దుకు సిద్ధమైంది. మరోవైపు హిందీ దృశ్యం3 కూడా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. అజయ్ దేవ్లణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.

Tags:    

Similar News