DSP: దుమ్ము లేపుతోన్న డీఎస్పీ లేటెస్ట్ మాస్ సాంగ్
డీఎస్పీ లేటెస్ట్ మాస్ సాంగ్;
DSP: దేవీ శ్రీ ప్రసాద్ అంటేనే స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరు. డీఎస్పీ అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇటీవల పుష్ప,థండేల్ మూవీతో మంచి పాటలను అందించి అలరించాడు. లేటెస్ట్ గా గాలి జనార్థన్ రెడ్డి కొడుకు కిరిటీ రెడ్డి కొత్త మూవీ జూనియర్ కి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. నిన్న ఈసినిమాలో ఓ కొత్త పాటను రిలీజ్ చేయగా దుమ్ములేపుతోంది. వైరల్ వయ్యారి అంటూ సాగే ఈ పాటను నిన్న రిలీజ్ చేశారు. వైరల్ వయ్యారి నేనే.. వయసొచ్చిన అణుబాంబునే.. ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫాలోయింగ్.. చూశావంటే బైండ్ బ్లోయింగ్.. నేనేమీ చేసినా ఫుల్ ట్రెండింగు.. అంటూ ప్రస్తుత సోషల్ మీడియా పోకడల గురించి కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని రాసిన సాహిత్యం ఆకట్టుకుంది. కిరీటీ గ్రేస్‌ఫుల్‌గా వేసిన స్టెప్పులు ఇంప్రెస్ చేశాయి. రాధాకృష్ణ దర్శకత్వంలో రజని కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జులై 18న ఈ చిత్రం విడుదల కానుంది.