Dude enters ₹100 crore club: రూ.100 కోట్ల క్లబ్ లో డ్యూడ్
డ్యూడ్
Dude enters ₹100 crore club: ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన 'డ్యూడ్' (Dude) సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్ర కలెక్షన్ల వివరాలు ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల్లో గ్రాస్ రూ.100 కోట్లు.. భారత్ లో నెట్ కలెక్షన్ (7 రోజుల్లో) సుమారు రూ.56.55 కోట్లు వచ్చాయి.వరుసగా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన ప్రదీప్ రంగనాథన్ మూడవ చిత్రంగా నిలిచింది. ప్రదీప్ రంగనాథన్ మొదటి చిత్రం లవ్ టుడే 100 కోట్ల గ్రాస్, రెండో చిత్రం డ్రాగన్ ఏకంగా రూ.150కోట్లు..మూడో చిత్రం డ్యూడ్ ఆరు రోజుల్లోనే రూ.100కోట్లు సాధించింది.
ఈ కథ ప్రధానంగా అగన్ (ప్రదీప్ రంగనాథన్), అతని మేనత్త కూతురు కుందన (మమితా బైజు) చుట్టూ తిరుగుతుంది.చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ కలిసి ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని నడుపుతుంటారు.
కుందన అగన్‌ను ప్రేమిస్తున్నానని చెప్పడం, అగన్ మొదట నిరాకరించి, ఆ తర్వాత ఆమె ప్రేమను అంగీకరించడం, పెళ్లికి సిద్ధం కావడం వంటి సంఘటనలు జరుగుతాయి.అయితే, పెళ్లికి ముందు కుందన మరొక వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో కథ అనూహ్య మలుపు తిరుగుతుంది.ఆ తర్వాత, ఒక పరువు హత్య నేపథ్యం చుట్టూ కథనం అల్లుకుని, కుల వ్యవస్థ, సంప్రదాయాలు, ప్రేమ మధ్య సంఘర్షణను చర్చిస్తుంది. ప్రేమించిన అమ్మాయి కోసం హీరో ఎలాంటి సాహసాలు, త్యాగాలు చేశాడనేది మిగతా కథ.'లవ్ టుడే' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత ప్రదీప్ రంగనాథన్ నటించిన సినిమా ఇది.