Kingdom Movie: కింగ్ డమ్ నుంచి ఎమోషనల్ సాంగ్

ఎమోషనల్ సాంగ్

Update: 2025-07-17 06:29 GMT

Kingdom Movie: విజయ్‌ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్‌డమ్ నుంచి కొత్త సాంగ్ వచ్చేసింది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగానే తాజాగా అన్నదమ్ముల ఎమోషనల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో విజయ్‌. సత్యదేవ్‌ అన్నదమ్ములుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి అనుబంధం నేపథ్యంతో రూపొందిన అన్నా అంటూనే అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. కృష్ణకాంత్‌ రాసిన ఈ పాటను అనిరుధ్‌ ఆలపించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు

ఈ సినిమా విజయ్ దేవరకొండకి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా. ఎందుకంటే అతని చివరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. 'కింగ్ డమ్'తో అతను హిట్ కొట్టాలని అతడి అభిమానులు ఆశిస్తున్నారు. కింగ్ డమ్ రెండు భాగాలుగా ఉంటుందని కూడా సమాచారం. 

Tags:    

Similar News