Sunita’s Candid Remark: ఆయనకు 50 ఎఫైర్లు ఉన్నా నాకేంటి?.. భర్త గోవిందాపై సునీతా ఆసక్తికర వ్యాఖ్యలు

సునీతా ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2026-07-13 06:01 GMT


Sunita’s Candid Remark: బాడీ షేమింగ్, ట్రోలింగ్ లాంటి వాటికి భయపడకుండా తన మనసులోని మాటను ముక్కుసూటిగా చెప్పే బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా భార్య సునీతా అహుజా తాజాగా చేసిన వ్యాఖ్యలు బీ-టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. తన భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలపై ఆమె స్పందించిన తీరు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.

ఫరా ఖాన్, రితేశ్ దేశ్‌ముఖ్ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్న లాకప్ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న సునీత.. తోటి కంటెస్టెంట్లు శిల్పా షిండే, రామ్ కపూర్‌లతో సంభాషిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె కాస్త ఘాటుగానే స్పందిస్తూ.. "అతను నా భర్త. ఒకవేళ ఆయనకు 50 మందితో అక్రమ సంబంధాలు ఉన్నా కూడా ఇతరులకు వచ్చే నష్టమేంటి? నేను అతని భార్యను, నా స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు" అంటూ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

ఈ షో నుండి ఎలిమినేట్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత.. తాను షోలో అన్న మాటలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యల పట్ల తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని తేల్చి చెప్పారు. తమ మధ్య ఉన్న 40 ఏళ్ల సుదీర్ఘ బంధానికి పునాది పరస్పర నమ్మకం, నిజమైన ప్రేమేనని ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలో భార్య స్థానం ఎప్పటికీ ప్రత్యేకమైనదని, దాన్ని ఎవరూ మార్చలేరని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాగా, 1987లో వివాహ బంధంతో ఒకటైన గోవిందా, సునీత దంపతులకు కుమార్తె టీనా, కుమారుడు యశ్‌వర్ధన్ ఉన్నారు.

Tags:    

Similar News