Famous Singer, Dubbing Artist Chinmayi Sripada: ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయిశ్రీపాద సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటుంది. ముఖ్యంగా మహిళల సమస్యలపై తన వాయిస్ గట్టిగానే వినిపిస్తుంటుంది. తాజాగా ఓ స్టార్ హీరోను విమర్శిస్తూ చిన్మయి చేసిన ట్వీట్ ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ లిరిసిస్ట్ వైరముత్తుకు ఇటీవల ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్ పురస్కారం పరించింది. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు విషెస్ తెలిపారు.

అందులో స్టార్ హీరో కమల్ హాసన్ సైతం కూడా ఉన్నారు. ఇప్పుడిదే చిన్మయి ఆగ్రహానికి కారణ మైంది. ‘సినిమాల్లో ఉన్న మగవాళ్లు రాజకీయాలకు మారడం, తన మామ, గురువు తమను లైంగికంగా వేధించాడని చెప్పిన మహిళలను పూర్తిగా పట్టించు కోకపోవడం ఆయనకే చెల్లుతుంది. పురుషులు ఎప్పటికీ మన వైపు ఉండరని ఓటు వేసే మహిళలు గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన సొంత పార్టీలోని మహిళ బహిరంగంగా కవి పేరును ప్రస్తావించినా పట్టించుకోకపోవడం మరి దారుణం. చివరగా పురుషులు కేవలం సోదరులు, మామలు, నాన్నలు. స్నే హితులు, సలహాదారులకు మాత్రమే అండగా నిలుస్తారు. మహిళలను ఎవరూ పట్టించుకోరు'అంటూ ట్వీట్ చేసింది.

Tags: