Samantha: భర్త ముందే సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని..

సమంత

Update: 2026-05-26 10:47 GMT

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మా ఇంటి బంగారం. నిన్న జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో ఒక ఊహించని, ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ అభిమాని వేదికపైకి వచ్చి సమంతకు ప్రపోజ్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

అసలేం జరిగిందంటే?

ట్రైలర్ లాంచ్ వేడుక అట్టహాసంగా జరుగుతున్న సమయంలో.. స్టేజ్ పై సమంత భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరు మాట్లాడుతున్నారు. అదే సమయంలో భద్రతా వలయాన్ని దాటుకుని ఒక అభిమాని ఒక్కసారిగా స్టేజ్ పైకి దూసుకొచ్చాడు. నేరుగా సమంత ముందుకు వెళ్ళి, మోకాళ్లపై కూర్చొని, చేతిలో ఉన్న పువ్వులను అందిస్తూ తన ప్రేమను వ్యక్తపరిచాడు.

ఈ అనూహ్య పరిణామానికి వేదికపై ఉన్న రాజ్ నిడిమోరుతో పాటు యాంకర్ శ్రీముఖి, దర్శకురాలు నందిని రెడ్డి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

సమంత మనసు గెలుచుకున్న తీరు..

వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆ అభిమానిని అక్కడి నుంచి పక్కకు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో సదరు అభిమాని సమంతతో ఒక సెల్ఫీ కావాలని కోరాడు. అక్కడ ఎంత గందరగోళం ఉన్నప్పటికీ.. సమంత ఎంతో ఓపికగా, చిరునవ్వుతో ఆ అభిమానిని దగ్గరకు పిలిచి సెల్ఫీ ఇచ్చారు.

Tags:    

Similar News