Mana Shankara Varaprasad Streaming Date: మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే..?

ఎప్పటినుంచంటే..?

Update: 2026-02-03 09:04 GMT

Mana Shankara Varaprasad Streaming Date: సంక్రాంతి విజేతగా నిలిచి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన మెగాస్టార్ చిరంజీవి చిత్రం మన శంకర వరప్రసాద్ గారు ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది. థియేటర్లలో రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులను పలకరించబోతోంది.

బాక్సాఫీస్ వద్ద అప్రతిహత విజయం

దర్శకుడు అనిల్ రావిపూడి, మెగాస్టార్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మాస్ ఎంటర్టైనర్ జనవరి 12న విడుదలై మూడు వారాలు గడిచినా బాక్సాఫీస్ వద్ద జోరు తగ్గించలేదు. ఇప్పటివరకు ఈ సినిమా ఏకంగా రూ. 400 కోట్ల మైలురాయిని చేరుకుని, ప్రాంతీయ సినిమాల్లో సరికొత్త రికార్డులను సృష్టించింది.

ఓటీటీ అప్‌డేట్: స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

ఈ భారీ చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ 5 భారీ ధరకు సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ నెల ఫిబ్రవరి 11 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, మెగా ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో ఈ వార్తను ట్రెండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News