Festival for Mega Fans: మెగా ఫ్యాన్స్ కు పండగే..హైప్ పెంచిన విశ్వంభర గ్లింప్స్
హైప్ పెంచిన విశ్వంభర గ్లింప్స్;
Festival for Mega Fans: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన విశ్వంభర గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. గ్లింప్స్ ఒక బాలుడు, వృద్ధుడి మధ్య జరిగే సంభాషణతో మొదలవుతుంది. విశ్వంలో ఒక వ్యక్తి స్వార్థం వల్ల జరిగిన వినాశనం గురించి వృద్ధుడు వివరిస్తాడు. ఆ క్లిష్ట సమయంలో రక్షకుడు అవతరించడం, శత్రువులను అంతం చేయడం చిరంజీవి ఎంట్రీతో గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
గతంలో వచ్చిన టీజర్ విజువల్స్ మీద విమర్శలు వచ్చాయి. అయితే, ఈసారి విడుదలైన గ్లింప్స్ లో విజువల్ ఎఫెక్ట్స్ , విజువల్స్ చాలా మెరుగ్గా ఉన్నాయి. భారీ స్థాయిలో గ్రాఫిక్స్ ఉన్నాయని, ఇది సినిమాపై అంచనాలను పెంచిందని అభిమానులు చెబుతున్నారు.
'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. కునాల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
ఈ సినిమా వచ్చే ఏడాది 2026 సమ్మర్లో విడుదల కానుంది. భారీగా ఉండే విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఈ విడుదలను వాయిదా వేసినట్లు చిరంజీవి స్వయంగా తెలిపారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది.