Yash’s Toxic: 150 కోట్ల నుంచి 30 కోట్లకు.. యశ్ టాక్సిక్ ఓటీటీ లెక్కలకు భారీ గండి..
భారీ గండి..
Yash’s Toxic: కేజీఎఫ్ 2 వంటి సంచలన విజయం తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్ట్‌పై విడుదలకు ముందు దేశవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అయితే థియేటర్లలో ఈ చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో ఆ ప్రభావం ఇప్పుడు నేరుగా డిజిటల్, శాటిలైట్ హక్కుల మార్కెట్‌పై తీవ్రంగా పడింది.
రూ. 150 కోట్ల నుంచి రూ. 30 కోట్లకు పడిపోయిన ఆఫర్?
విడుదలకు ముందు ఉన్న క్రేజ్, స్టార్ కాస్ట్, బోల్డ్ ప్రచార చిత్రాల కారణంగా ఓ అగ్ర ఓటీటీ సంస్థ ఈ చిత్ర డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా రూ. 150 కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు ప్రచారం సాగింది. థియేట్రికల్ రన్ తర్వాత మరింత భారీ ధరకు విక్రయించవచ్చనే నమ్మకంతో నిర్మాతలు ఆ ప్రతిపాదనను హోల్డ్‌లో పెట్టినట్లు వార్తలు వచ్చాయి. కానీ, సినిమా ఫలితం తారుమారు కావడంతో ఓటీటీ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ ప్లాట్‌ఫామ్ జీ5 ఈ హక్కుల కోసం కేవలం రూ. 30 కోట్ల వరకు మాత్రమే కోట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ ఆఫర్లపై నిర్మాణ సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఏ సర్టిఫికెట్‌తో శాటిలైట్‌కు సరికొత్త చిక్కులు
బోల్డ్ కంటెంట్ నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో టెలివిజన్ ప్రీమియర్‌కు నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌కు అనుగుణంగా కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను కత్తిరించి లేదా మార్పులు చేసి శాటిలైట్ కోసం ప్రత్యేక వెర్షన్‌ను రూపొందించే పనిలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే డిజిటల్ స్ట్రీమింగ్‌కు కూడా ప్రత్యేక కట్‌ను అందించే దిశగా చిత్ర బృందం కసరత్తు చేస్తోందని సమాచారం.