Genelia D'Souza: ఆడిషన్స్ ఇవ్వడంలో తప్పేంటి.?
ఇవ్వడంలో తప్పేంటి.?;
Genelia D'Souza: బాయ్స్ సినిమాతో టాలీవుడ్ లో కి ఎంట్రీ చ్చిన భామ జెనిలియా. సత్యం, సై, హ్యాపీ తదితర చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచేసింది. 'నా ఇష్టం' తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఇక రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు రీసెంట్గా బాలీవుడ్ అమీర్ ఖాన్ నటించిన 'సీతారే జమీన్ పర్ తో రీ ఎంట్రీ ఇచ్చింది.
ఇప్పుడు త్వరలో 'జూనియర్' తో ప్రే క్షకుల ముందు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ ఇకపై ప్రాధాన్యం ఉన్న పా త్రల్లోనే నటిస్తానని, వాటి కోసం ఆడిషన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధమేనని తెలిపింది. ఆడిషన్స్ఇవ్వడం కరెక్ట్ అని తన అభిప్రా యమని చెప్పింది. ఎందుకంటే ఆడిషన్ ఇవ్వడం వల్ల సరైన పాత్రలను సెలక్ట్ చేసుకోవడం ఈజీ అవుతోందంటోంది. దాని వల్ల ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో అవకాశాలు మనం అందిపుచ్చు కోగలుగుతామని తెలిపింది. ఆడిషన్స్ ఇవ్వడంలో తప్పులేదంటోందీ అమ్ముడు.