Genelia: రీ ఎంట్రీ హ్యాపీగా ఉందన్న జెనీలియా
హ్యాపీగా ఉందన్న జెనీలియా;
Genelia: తుఝ మేరీ కసమ్ సినిమాతో 2003లో తెరంగేట్రం చేసిన భామ జెనీలియా. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ కుమారుడు రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకున్న తర్వాత ఈ అమ్మడు సినిమా లకు బ్రేక్ ఇచ్చింది. 2012 నుంచి చిత్ర పరిశ్రమకు దూరమైంది. మరాఠీ చిత్రం 'వేద్ 'తో తిరిగి నటనలో కి రీఎంట్రీ ఇచ్చింది. 2022లో విడుదలైన ఈ చిత్రాని కి రితేష్ స్వయంగా దర్శకత్వం వహించగా మరాఠాలో విజయవంతమైంది. తన పదేండ్ల గ్యాప్ పై ఓ ఇంటర్వ్యూతో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించిందీ భామ. తాను పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి పెద్దగా ఆందోళన చెందడం లేదని, బయటి వ్యక్తి అయితే ఇబ్బంది పడేవారని తెలిపింది. పెండ్లి తర్వాత పదేండ్ల గ్యాప్ తీసుకోవాలని అనుకున్నట్టు తెలిపింది. అప్పుడు తనకు ఉన్న ఆప్షన్ అదొక్కటేనని అంటోంది. షూటింగులు చేయడం అంటే రేయింబవళ్లు కొన్ని షెడ్యూల్స్ ఉంటాయి. రాత్రి పూట షూట్ లతో కొన్ని సమస్యలు ఉన్నాయని, అందుకే గ్యాప్ తీసుకున్నాన ని తెలిపింది. సరైన సమయంలో రీఎంట్రీ ఇచ్చానని, ఇప్పుడు హ్యాపీయెస్ట్ ప్లేస్ లో ఉన్నానని చెప్పుకొచ్చిందీ భామ. రితేష్ జెనీలి యా ఇద్దరు పిల్లల పేరెంట్స్ పిల్లల కోసం జెనీలియా తన కెరీర్ ని కొంత త్యాగం చేసింది. ఇదిలా ఉండగా ఈ అమ్మడు నటించిన సితారే జమీన్ పర్ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ మూవీ లో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు.