Allu Arjun’s Film with Lokesh Kanagaraj: గ్లోబల్ బాక్సాఫీస్‌పై ఐకాన్ స్టార్ దండయాత్ర: లోకేశ్ కనగరాజ్‌తో మూవీపై రైటర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
లోకేశ్ కనగరాజ్‌తో మూవీపై రైటర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Allu Arjun’s Film with Lokesh Kanagaraj: అల్లు అర్జున్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న AA23 ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కథాంశంపై రచయిత రత్నకుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. ఈ సినిమా కేవలం భారతీయ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా, అంతర్జాతీయ ఆడియన్స్‌ను కూడా మెప్పించేంత గొప్ప కథతో రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం టీమ్ సుమారు మూడు వారాల పాటు అల్లు అర్జున్‌తో సుదీర్ఘ చర్చలు జరిపింది. ఆయన ఇన్పుట్స్ టీమ్‌లో ఎంతో ఉత్సాహాన్ని నింపాయి. మే రెండో వారం నుండి పనులు మరింత వేగవంతం కానున్నాయి. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
రాకాలో అల్లు అర్జున్.. తోడుగా దీపికా పదుకొణె!
మరోవైపు అగ్ర దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న 'రాకా' సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ కథాంశంతో అట్లీ వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు.
ఈ భారీ బడ్జెట్ మూవీలో గ్లోబల్ స్టార్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటి నుండే సోషల్ మీడియాలో భారీ ట్రెండ్ సెట్ చేస్తోంది.
సోషల్ మీడియాలో రాకా సెన్సేషన్
ఈ సినిమా థీమ్ సాంగ్ మరియు అనౌన్స్‌మెంట్ వీడియో అప్పుడే రికార్డులను తిరగరాస్తోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ థీమ్ సాంగ్‌పై ఏకంగా ఒక మిలియన్ (10 లక్షల) రీల్స్ క్రియేట్ అవ్వడం విశేషం. ఈ స్పందన చూస్తుంటే సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో అర్థమవుతోందని దర్శకుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు.