Gokulashtami: మెగా ఇంట్లో గోకులష్టమి వేడుకలు.. రాధాకృష్ణులుగా చిన్నారులు
రాధాకృష్ణులుగా చిన్నారులు
Gokulashtami: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల నివాసంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వేడుకగా జరిగాయి. పండుగ సందర్భంగా తమ ముగ్గురు పిల్లలను రాధాకృష్ణుల గెటప్‌లలో ముస్తాబు చేసి పండుగ సంబరాన్ని రెట్టింపు చేసుకున్నారు. పిల్లలందరినీ చూడముచ్చటగా అలంకరించిన ఫొటోను ఉపాసన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘మా కొణిదెల వారి ఇంట్లోకి చిన్ని కృష్ణుడు వచ్చాడు.. ఎట్టకేలకు నా కల నెరవేరింది’ అంటూ ఆమె రాసుకొచ్చిన క్యాప్షన్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ అందమైన ఫ్యామిలీ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
రామ్ చరణ్-ఉపాసన దంపతులకు 2023 జూన్‌లో తొలి సంతానంగా క్లీంకార జన్మించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరికి కవలలు జన్మించగా.. కుమారుడికి శివరామ్, కుమార్తెకు అన్వీరా దేవిగా నామకరణం చేశారు. ప్రస్తుతం చరణ్ కుటుంబ బాధ్యతలతో పాటు కెరీర్ పరంగానూ దూసుకుపోతున్నారు. ఆయన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.