Good News for Chiru and Venky Fans: చిరు,వెంకీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. డిసెంబర్ 30న మెగా విక్టరీ మాస్ సాంగ్
డిసెంబర్ 30న మెగా విక్టరీ మాస్ సాంగ్
Good News for Chiru and Venky Fans: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు' నుండి ఒక అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని మూడో పాట మెగా విక్టరీ మాస్ సాంగ్ ను డిసెంబర్ 30న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసింది.
ఈ పాటలో విశేషం ఏమిటంటే, మెగాస్టార్ చిరంజీవితో కలిసి విక్టరీ వెంకటేష్ స్టెప్పులు వేయబోతున్నారు. ఈ ఇద్దరు దిగ్గజ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించనుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన పోస్టర్‌లో వీరిద్దరూ ఫుల్ జోష్‌తో, స్టైలిష్ డాన్స్ పోజుల్లో కనిపిస్తున్నారు. ఈ మాస్ సాంగ్ ప్రోమోను డిసెంబర్ 27న (ఈరోజు) విడుదల చేయనున్నారు. డిసెంబర్ 30న ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తారు.
ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో అదిరిపోయే మాస్ ట్యూన్స్‌ను అందించారు. బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, వెంకటేష్ ఒక కీలకమైన అతిథి పాత్రలో కనిపిస్తారు. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.