Ram Charan’s “Peddi”: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. జూన్ 4న పెద్ది రిలీజ్ డేట్ ఫిక్స్
జూన్ 4న పెద్ది రిలీజ్ డేట్ ఫిక్స్
Ram Charan’s “Peddi”: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'పెద్ది' సినిమా విడుదలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చేసింది. గత కొంతకాలంగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న 'పెద్ది'.. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతోంది.శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చిత్ర యూనిట్ ఈ వివరాలను వెల్లడిస్తూ అభిమానుల్లో జోష్ నింపింది
నిజానికి ఈ సినిమాను మార్చిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ తొలుత భావించారు. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. షూటింగ్ బ్యాలెన్స్ ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ , గ్రాఫిక్స్ వర్క్ కోసం మరికొంత సమయం కావాలని చిత్ర బృందం భావించడంతో రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. మధ్యలో జూన్ 25న సినిమా వస్తుందని దర్శకుడు బుచ్చిబాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో అభిమానులంతా అదే తేదీని ఫిక్స్ చేసుకున్నారు. అయితే, జూన్ 26న అఖిల్ అక్కినేని 'లెనిన్' విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద పోటీ తప్పదని అందరూ భావించారు.
కానీ ఊహించని విధంగా చిత్ర యూనిట్ జూన్ 4వ తేదీని లాక్ చేసింది. దీనికి ప్రధాన కారణం.. కన్నడ స్టార్ యశ్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా వాయిదా పడటమే! టాక్సిక్ రేసు నుంచి తప్పుకోవడంతో ఆ ఖాళీని భర్తీ చేస్తూ, సోలో రిలీజ్ అడ్వాంటేజ్ పొందేందుకు 'పెద్ది' టీమ్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అఖిల్ 'లెనిన్' సినిమాతో పోటీ తప్పడమే కాకుండా, సమ్మర్ సీజన్ చివరలో భారీ వసూళ్లు రాబట్టే అవకాశం రామ్ చరణ్‌కు దక్కింది. మరి బుచ్చిబాబు మార్క్ ఎమోషన్స్, రామ్ చరణ్ మాస్ పర్ఫార్మెన్స్‌తో 'పెద్ది' ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.