‘Rakasa’ Tickets: మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్.. రూ.100కే రాకాస టికెట్
రూ.100కే రాకాస టికెట్
‘Rakasa’ Tickets: నిర్మాతగా నిహారిక కొణిదెల మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా.. మానస శర్మ దర్శకత్వంలో రూపొందిన ‘రాకాస’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. గత వారం విడుదలైన ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ సాధించి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం డిస్ట్రిబ్యూటర్లతో కలిసి గ్రాండ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’లాగే, ‘రాకాస’ కూడా మాకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సమ్మర్‌లో ఒక చల్లని గాలిలా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. మున్ముందు నిహారిక చేసే సినిమాలన్నీ మేమే డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటున్నాం’. అని నిర్మాత రవిశంకర్ అన్నారు.డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉంటేనే సినిమా నిజమైన హిట్ అని అర్థం. రెండో వారంలోనూ మా సినిమాకు మంచి స్క్రీన్లు దక్కడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని సంగీత్ శోభన్ అన్నారు.
నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ప్రతి సినిమాతో మా డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను. మా డిస్ట్రిబ్యూటర్లందరూ సంతృప్తిగా ఉన్నారంటే అదే మాకు నిజమైన విజయం. సామాన్య ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చేరువ కావాలని, సింగిల్ స్క్రీన్‌లలో కేవలం వంద రూపాయలకే టికెట్ అందిస్తున్నాం" అని నిహారిక పేర్కొన్నారు.దర్శకురాలు మానస శర్మ తన కలని నిజం చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పగా.. నటుడు బ్రహ్మాజీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు.