Nara Rohit: నారా ఫ్యామిలీకి గుడ్ న్యూస్.. తండ్రి కాబోతున్న నారా రోహిత్
తండ్రి కాబోతున్న నారా రోహిత్
Nara Rohit: టాలీవుడ్ నటుడు నారా రోహిత్ ఇంట్లో త్వరలో చిన్నారి అడుగుల సడి వినబడబోతోంది. నారా రోహిత్ తండ్రి కాబోతున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రోహిత్ భార్య శిరీష గర్భవతి అని, ఇటీవలే ఆమెకు సీమంతం వేడుక కూడా ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రానప్పటికీ, శిరీష బేబీ బంప్‌తో ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. గతేడాది అక్టోబర్‌లో వీరిద్దరి వివాహం ఎంతో వైభవంగా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ శుభవార్త విన్న అభిమానులు, నెటిజన్లు మెగా ఫోన్ పట్టుకుని శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.
ఒకవైపు వ్యక్తిగత జీవితంలో ఇంతటి సంతోషం ఉండగా, మరోవైపు కెరీర్ పరంగా కూడా నారా రోహిత్ దూసుకుపోతున్నారు. గతేడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన, ప్రస్తుతం ఒక క్రేజీ ప్రాజెక్టులో భాగమయ్యారు. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం - హౌస్ నెం.47’లో రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. త్రివిక్రమ్-వెంకటేష్ కాంబినేషన్ అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి, దానికి తోడు నారా రోహిత్ కూడా తోడవడంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
ఈ ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం కేవలం ఫ్యామిలీ డ్రామా మాత్రమే కాదు.. కుటుంబ భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఒక గ్రిప్పింగ్ క్రైమ్ డ్రామా అని సమాచారం. త్రివిక్రమ్ మార్కు డైలాగులు, వెంకటేష్ నటన, నారా రోహిత్ పర్ఫార్మెన్స్ కలిసి ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.