Good News for Pawan Fans: పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. OG షూటింగ్ కంప్లీట్

OG షూటింగ్ కంప్లీట్;

Update: 2025-07-12 06:33 GMT

Good News for Pawan Fans: పవన్ కళ్యాణ్‌‌‌‌‌‌‌‌ అభిమానులకు గుడ్ న్యూస్. సెప్టెంబర్ 25న ఓజీని వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించగా..తాజాగా షూటింగ్ కంప్లీట్ అయ్యిందని తెలిపారు మేకర్స్. ఫైరింగ్ పూర్తయింది. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపడానికి సిద్ధంగా ఉందంటూ షూటింగ్ అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ను అందించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన స్టిల్‌‌‌‌‌‌‌‌లో పవన్ కళ్యాణ్ గన్ పట్టుకుని ఇంటెన్స్ లుక్‌‌‌‌‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నారు.

సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్. ఇమ్రాన్ హష్మీ విలన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తుండగా అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంతకు ముందే విడుదల కావాల్సి ఉన్నా నిర్మాణ జాప్యం , పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా వాయిదా పడింది.పవన్ కళ్యాణ్ స్టార్ పవర్,ఆసక్తికరమైన కథాంశం కారణంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరో వైపు పవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఒక భారీ బడ్జెట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహరవీరమల్లు ప్రపంచ వ్యాప్తంగా జులై 24న విడుదల కానుంది.ఈ చిత్రం 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగుతుంది. మొఘల్ సామ్రాజ్య దౌర్జన్యాన్ని ధిక్కరించిన వీర మల్లు అనే సాహసోపేతమైన బందిపోటు యోధుడి జీవితం చుట్టూ కథ తిరుగుతుంది.  

Tags:    

Similar News