Thaman’s Sensational Remarks: టాలీవుడ్ లో ఐక్యత లేదు..తమన్ సంచలన వ్యాఖ్యలు

తమన్ సంచలన వ్యాఖ్యలు

Update: 2025-12-15 06:08 GMT

Thaman’s Sensational Remarks: సంగీత దర్శకుడు తమన్ 'అఖండ 2' సినిమా విజయోత్సవ కార్యక్రమంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు."మన తెలుగు సినీ ఇండస్ట్రీకి దిష్టి తగిలిందేమో అనిపిస్తుంది."

ఇండస్ట్రీలో ఐక్యత (యూనిటీ) లేకుండా పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. అందరూ 'మనం' అనుకుంటే కలిసి ముందుకు వెళ్తామన్నారు. యూట్యూబ్, సోషల్ మీడియా ఎక్కడ చూసినా నెగెటివిటీ పెరిగిపోయిందని, ఒకరినొకరు తిట్టుకుంటున్నారని వాపోయారు.

ఇండస్ట్రీలో వెన్నుపోట్లు ఎక్కువయ్యాయని, తాను ఒక సినిమాకు మాట్లాడుతున్నప్పుడు, మరో సంగీత దర్శకుడు తక్కువ పారితోషికానికి ఆ సినిమా చేస్తానని వస్తున్నారని ఆరోపించారు. ఇతర భాషలకు చెందిన సంగీత దర్శకులు తెలుగులో కోట్లలో పారితోషికం తీసుకుంటున్నారని, వారికి ఇక్కడ దక్కుతున్న ఆదరణ తనకు తమిళంలో దక్కడం లేదని, దీనికి తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న ఐక్యత కారణమని అన్నారు. "ఎవరికైనా దెబ్బ తగిలినప్పుడు బ్యాండెడ్‌ (Bandage) వేయడానికి ట్రై చేయండి, దాని గురించి బయటకెళ్లి బ్యాండ్‌ (Band) వేయకండి" అని సూచించారు.

'అఖండ 2' సినిమా వాయిదా పడిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ, సినిమా వాయిదా పడటం వల్ల నిర్మాతలు ఎంత కుమిలిపోయి ఉంటారో అర్థం చేసుకోవాలని, వాళ్ళకు కూడా కుటుంబం ఉంటుందని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సంక్రాంతికి రాబోయే సినిమాలన్నీ మంచి విజయం సాధించాలి. నేను ఏ సినిమానైనా ప్రమోట్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పటికైనా అందరూ కలిసి ముందుకు వెళ్లాలి అని తమన్‌ అన్నారు.

Tags:    

Similar News