‘Virosh’ Couple: విద్యార్థులకు విరోష్ జంట గుడ్ న్యూస్..

విరోష్ జంట గుడ్ న్యూస్..

Update: 2026-03-03 06:01 GMT

 ‘Virosh’ Couple: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు సొంతూరుతో ఎమోషనల్బాండింగ్ ఉంది.ఇటీవల నటి రష్మికను పెండ్లి చేసుకున్న హీరో తన భార్య రష్మికతో కలిసి సొంతూరు నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్పేటకు వచ్చారు. గ్రామస్తులందరికీ దావత్ ఇచ్చారు. ఫామ్ హౌజ్లో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి గృహ ప్రవేశం చేసి సత్య నారాయణ వ్రతం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. 'మా నాన్న ఊర్లో పొలం కొందాం. వ్యవసాయం చేసుకుందాం. ఇల్లు కట్టుకుందాం అని చెప్పేవారు. ఆకోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం, పెండ్లి చేసుకోవడం ఒకేసారి జరిగాయి. ఇక నుంచి గ్రామా నికి రెగ్యులర్గా వస్తాం. తమ్ముడు ఆనంద్ పెండ్లి గ్రామంలోని అందరి సమక్షంలో చేస్తాం' అని చెప్పారు. ఊరికి చేసేది చాలా ఉందని, అందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట నియోజకవ ర్గంలోని 44 ప్రభుత్వ స్కూళ్లలో 9వ తరగతి, 10 వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్పులు అందిస్తామన్నారు.

Tags:    

Similar News