Randeep Hooda and His Wife: బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా, అతని భార్య లిన్ లైశ్రామ్ తమ అభిమానులకు శుభవార్త అందించారు. వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా, రణ్‌దీప్ త్వరలో తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. 2023 నవంబర్ 29న నటి లిన్ లైశ్రామ్‌ను వివాహం చేసుకున్న రణ్‌దీప్ హుడా, తమ పెళ్లి రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఒక అందమైన ఫోటోను షేర్ చేశారు. పచ్చని చెట్ల మధ్య చలి మంట కాచుకుంటున్న ఈ దంపతులు, ఈ పోస్ట్‌కు భావోద్వేగభరితమైన క్యాప్షన్ జోడించారు."రెండేళ్ల మా ప్రయాణం.. ఇప్పుడు మా ఇంట్లోకి ఓ బుజ్జి పాపాయి రాబోతోంది" అని రణ్‌దీప్ ప్రకటించారు. దాదాపు 50 ఏళ్ల వయసులో రణ్‌దీప్ ఈ శుభవార్త చెప్పడంతో, సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

నటీనటుల సినీ ప్రస్థానం

రణ్‌దీప్ హుడా రిస్క్, లవ్ కిచిడీ, జన్నత్ 2, హైవే, సుల్తాన్, లవ్ ఆజ్ కల్, భాగీ 2 వంటి పలు విజయవంతమైన చిత్రాలలో నటించి గుర్తింపు పొందారు. ఇటీవల స్వతంత్ర వీర్ సావర్కర్ చిత్రంలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన అమెరికన్ చిత్రం మ్యాచ్‌బాక్స్‌లో నటిస్తున్నారు. లిన్ లైశ్రామ్ ఓం శాంతి ఓం, మేరీ కోమ్, ఉమ్రిక రంగూన్ వంటి పలు చిత్రాలలో నటించారు.

Tags: