‘Goodachari 2’ First Review: ‘గూఢచారి 2’పై ఫస్ట్ రివ్యూ.. ఇండియన్ స్పై సినిమాల రేంజ్ మారిపోతుందట!
మారిపోతుందట!
‘Goodachari 2’ First Review: అడివి శేష్ కెరీర్‌లో మంచి గుర్తింపు తెచ్చిన సినిమాల్లో ‘గూఢచారి’ ఒకటి. తెలుగు సినిమా స్పై థ్రిల్లర్లలో ప్రత్యేకంగా నిలిచిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గూఢచారి 2’ తెరకెక్కుతోంది. ఈసారి సినిమా భారీ స్థాయిలో రూపొందుతోంది. ఏకంగా రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
ఇంకా సినిమా షూటింగ్ పూర్తికాకముందే ‘గూఢచారి 2’కి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తన లెటర్‌బాక్స్‌డ్ ప్రొఫైల్‌లో ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
సాధారణంగా అడివి శేష్ తన సినిమాల షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయ్యాకే చూపిస్తారని రాహుల్ రవీంద్రన్ తెలిపారు. అయితే ‘గూఢచారి 2’ షూటింగ్ 70 శాతం పూర్తైన సమయంలోనే సినిమా చూశానని చెప్పారు. సినిమా చూసిన తర్వాత తాను షాక్ అయ్యానని, ఇండియన్ స్పై థ్రిల్లర్లకు ఈ సినిమా కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయబోతోందని ప్రశంసించారు.
సినిమాలోని విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, కథ, ట్విస్టులు అద్భుతంగా ఉన్నాయని రాహుల్ రవీంద్రన్ పేర్కొన్నారు. సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు భారీ ప్రభావం చూపుతుందని అన్నారు. అడివి శేష్ తన స్థాయిని మరింత పెంచుకున్నాడని ప్రశంసించారు.
అంతేకాదు.. ఇప్పటివరకు అడివి శేష్ చేసిన సినిమాల్లో ‘గూఢచారి 2’ తనకు అత్యంత ఇష్టమైన సినిమా అని రాహుల్ రవీంద్రన్ చెప్పారు. అడివి శేష్‌ను ఇండియాలో ఇప్పటివరకు తెరపై కనిపించిన బెస్ట్ స్పైగా కూడా అభివర్ణించారు. సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న ఇమ్రాన్ హష్మి, వామికా గబ్బిలను కూడా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఇటీవల వచ్చిన బాలీవుడ్ స్పై యాక్షన్ మూవీ ‘ధురంధర్’ ఇండియన్ స్పై సినిమాలకు భారీ స్థాయిలో బెంచ్‌మార్క్ సెట్ చేసింది. ఇప్పుడు రాహుల్ రవీంద్రన్ చెప్పినట్లుగా ‘గూఢచారి 2’ ఆ స్థాయిని దాటి వెళ్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.