Grand Wedding of Nara Rohit : ఘనంగా నారా రోహిత్ పెళ్లి: శిరీషతో ఏడడుగులు!

శిరీషతో ఏడడుగులు!

Update: 2025-10-31 01:51 GMT

Grand Wedding of Nara Rohit : యంగ్ హీరో నారా రోహిత్ నటి శిరీష లేళ్లను (సిరి) వివాహమాడి కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. అక్టోబర్ 30వ తేదీ రాత్రి 10:35 గంటలకు హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రోహిత్-శిరీషల వివాహ వేడుకలు ఐదు రోజుల పాటు ఘనంగా జరిగాయి. అక్టోబర్ 25న హల్దీ వేడుకతో మొదలై, 26న పెళ్లికొడుకు కార్యక్రమం, 28న మెహందీ, 29న సంగీత్ నైట్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలన్నీ నారా కుటుంబంలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. నారా రోహిత్, దివంగత నారా రామ్మూర్తి నాయుడు గారి తనయుడు కావడంతో, ఈ వివాహానికి నారా కుటుంబం నుంచే కాక రాజకీయ వర్గాల నుంచి కూడా అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు దగ్గరుండి పెళ్లి వేడుకలను పర్యవేక్షించారు. మంత్రి నారా లోకేష్ తన కుటుంబంతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నందమూరి బాలకృష్ణ వంటి కుటుంబ సభ్యులు కూడా సందడి చేశారు. నారా రోహిత్, శిరీషలు గతంలో కలిసి 'ప్రతినిధి 2' చిత్రంలో నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారి, పెద్దల అనుమతితో గతేడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం జరిగింది. తండ్రి మరణం కారణంగా వాయిదా పడిన వివాహం, ఇప్పుడు ఘనంగా జరగడంతో నారా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. నూతన వధూవరులు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Tags:    

Similar News