Prabhas Injured: షూటింగ్ లో గాయపడ్డ ప్రభాస్.. ట్రోలర్లకు ఫ్యాన్స్ కౌంటర్..
ట్రోలర్లకు ఫ్యాన్స్ కౌంటర్..
Prabhas Injured: గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల రాజా సాబ్ విషయంలో ఆయన లుక్ మరియు బాడీ లాంగ్వేజ్‌పై సోషల్ మీడియాలో కొన్ని ప్రతికూల వ్యాఖ్యలు.. "డూప్స్‌తోనే షూటింగ్ కానిచ్చేస్తున్నారు" అనే ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటన్నింటికీ తన పని తీరుతోనే ప్రభాస్ గట్టి సమాధానం ఇచ్చారు.
షూటింగ్‌లో ప్రమాదం.. ఫ్యాన్స్ ఆందోళన
ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ షూటింగ్‌లో ప్రభాస్ పాల్గొంటున్నారు. ఈ సినిమా కోసం ఒక కీలకమైన గుర్రపు స్వారీ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. గుర్రం అదుపు తప్పడంతో ప్రభాస్ కింద పడిపోయారు. ఈ క్రమంలో ఆయన చేతులకు స్వల్ప గాయాలయ్యాయి.
ఈ వార్త బయటకు రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే ఇవి చిన్న గాయాలేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్ర యూనిట్ స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ట్రోలర్లకు ఫ్యాన్స్ కౌంటర్
ఈ సంఘటనను ఉటంకిస్తూ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోలర్లపై విరుచుకుపడుతున్నారు. "రిస్కీ సీన్స్ కోసం డూప్స్ వాడతారని విమర్శించిన వారు ఇప్పుడు ఏమంటారు? గాయాలైనా లెక్కచేయకుండా ప్రభాస్ చూపిస్తున్న డెడికేషన్ ఇది" అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. తమ హీరో కష్టాన్ని తక్కువ చేసి చూడవద్దని, ఆయన డెడికేషన్ ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉందని గట్టిగా వాదిస్తున్నారు.
విశ్రాంతి:
వైద్యుల సూచన మేరకు ప్రభాస్ ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకుని, తిరిగి ఫౌజీ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. ఫౌజీ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రానున్న స్పిరిట్ సినిమాపై ప్రభాస్ దృష్టి సారించనున్నారు. వరుస షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి చేసిన తర్వాత, కొంతకాలం పాటు తన ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.