Mirai: మిరాయ్ తొలి రోజు కలెక్షన్లు ఎన్ని కోట్లంటే.?

కలెక్షన్లు ఎన్ని కోట్లంటే.?

Update: 2025-09-13 06:31 GMT

Mirai: యంగ్ హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదలైన మొదటి రోజు (శుక్రవారం) అద్భుతమైన వసూళ్లను రాబట్టింది.'హను-మాన్' మొదటి రోజు కలెక్షన్లను (రూ.8 కోట్లు) 'మిరాయ్' అధిగమించింది.హైదరాబాద్లో అత్యధిక ఆక్యుపెన్సీ (సుమారు 85.5%)నమోదైంది. ఈ సినిమా హిందీ వెర్షన్‌ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ డిస్ట్రిబ్యూట్ చేశారు.

మొదటి రోజు కలెక్షన్లు అన్ని భాషల్లో కలిసి భారత్ నెట్ కలెక్షన్ సుమారుగా రూ.12 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్త సుమారుగా రూ.23 నుంచి రూ.25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలో 700K డాలర్స్ కలెక్ట్ చేసినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వారాంతంలో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.బడ్జెట్ సుమారుగా రూ.60 కోట్లు కాగా, డిజిటల్ హక్కుల ద్వారానే రూ.40 కోట్లు రికవరీ అయిందని సమాచారం. దీనితో బ్రేక్ ఈవెన్ సాధించడం సినిమాకు సులభం కానుంది.

భాషలవారీగా కలెక్షన్లు:

తెలుగు: రూ.10.60 కోట్లు

హిందీ: రూ.1.25 కోట్లు

తమిళ్, మలయాళం, కన్నడ: ఒక్కో భాషలో రూ.5 లక్షల చొప్పున వచ్చాయి.

Tags:    

Similar News