Gulf Academy Movie Awards (GAMA): అవార్డ్స్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ లాంటివి

టాబ్లెట్స్ లాంటివి;

Update: 2025-08-25 11:09 GMT

Gulf Academy Movie Awards (GAMA): గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్ (GAMA)ఐదో ఎడిషన్ అవార్డుల వేడుక ఆగస్టు 30న దుబాయ్ లో జరగనుంది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో జరిగిన ఒక కర్టెన్ రైజర్ ఈవెంట్‌లో కోదండ రామిరెడ్డి ఈ అవార్డుల గురించి మాట్లాడారు. దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్ లో జరగనున్న ఈ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.

అవార్డ్స్ అనేవి నటీనటులకు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ లాంటివి" అని ఆయన అన్నారు. ఇలాంటి అవార్డులు కళాకారులను ప్రోత్సహించి, వారిని మరింత ఉత్సాహపరుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ అవార్డులు 2024 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు అందించనున్నారు. మొత్తం 24 విభాగాలలో అవార్డులు ఇవ్వనున్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే గల్ఫ్ ప్రాంతంలో ఈ వేడుకకు మంచి ఆదరణ ఉంది.

జ్యూరీ సభ్యుడు: ఈ ఏడాది GAMA అవార్డులకు కోదండ రామిరెడ్డి, బి. గోపాల్, సంగీత దర్శకుడు కోటి వంటి ప్రముఖులు జ్యూరీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఈప్రోగ్రామ్ కు యాంకర్ సుమతో పాటు వైవా హర్ష యాంకరింగ్ చేయనున్నారు.

Tags:    

Similar News