Actress Hansika: తప్పుడు ట్రైన్ ఎక్కితే దిగిపోవడమే మేలు.. విడాకులపై హన్సిక ఓపెన్ కామెంట్స్

విడాకులపై హన్సిక ఓపెన్ కామెంట్స్

Update: 2026-04-17 15:06 GMT

Actress Hansika: తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న 'దేశముదురు' భామ హన్సిక మోత్వానీ తన వ్యక్తిగత జీవితం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో విడిపోతున్నట్లు వస్తున్న వార్తలను ధృవీకరిస్తూనే, తన జీవితంలో ఎదురైన ఈ క్లిష్ట పరిస్థితులపై ఆమె మొదటిసారి మౌనం వీడారు.

రాంగ్ ట్రైన్ ఎక్కితే దిగాల్సిందే

ఓ ఇంటర్వ్యూలో తన విడాకుల గురించి హన్సిక మాట్లాడుతూ ఆసక్తికరమైన పోలికను ఉపయోగించారు. "మనం ఒక తప్పుడు ట్రైన్ ఎక్కామని తెలిసినప్పుడు, అందులో ఉండి బాధపడటం కంటే వీలైనంత త్వరగా దిగిపోవడమే మంచిది. నా నిర్ణయం పట్ల నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు" అని ఆమె కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం తాను ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు.

క్లిక్ బైట్స్ కోసమే ఈ గోల

సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. "జనాలకు కేవలం హెడ్ లైన్స్, క్లిక్ బైట్స్ మాత్రమే కావాలి. అందుకే దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వదలచుకోలేదు. నా వ్యక్తిగత విషయాలు మా ఇద్దరి మధ్యే ఉండాలని కోరుకుంటున్నాను" అని హన్సిక పేర్కొన్నారు. కేవలం చర్చల కోసం కాకుండా తన ఆత్మగౌరవానికి ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె మాటల ద్వారా అర్థమవుతోంది.

కుటుంబమే కొండంత అండ

ఈ కష్టకాలంలో తన తల్లి, అన్నయ్య తనకు అండగా నిలిచారని హన్సిక తెలిపారు. "నేను ఎప్పుడూ చాలా సరదాగా ఉండేదాన్ని. కానీ గత కొంతకాలంగా నాలో మార్పును గమనించిన నా కుటుంబ సభ్యులు.. 'నువ్వు సంతోషంగా లేని చోట ఉండాల్సిన అవసరం లేదు' అని నాకు మద్దతుగా నిలిచారు" అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. విడాకుల తర్వాత మానసిక ప్రశాంతత కోసం ఆమె కుటుంబంతో కలిసి జపాన్ పర్యటనకు వెళ్లి వచ్చారు.

ఫ్లాష్ బ్యాక్

2022 డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ముండోటా కోటలో హన్సిక-సోహైల్ వివాహం అట్టహాసంగా జరిగింది. వీరి పెళ్లి వేడుకను ఓటీటీలో డాక్యుమెంటరీగా కూడా ప్రసారం చేశారు. అయితే 2024 జూలై నుండే వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారని, వ్యక్తిత్వాలు కలవకపోవడం వల్లే విడాకులు తీసుకున్నట్లు కోర్టు డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది.

Tags:    

Similar News