Hansika Motwani’s Marriage Ends: ముగిసిన హన్సిక వైవాహిక బంధం.. పరస్పర అంగీకారంతో విడాకులు!

పరస్పర అంగీకారంతో విడాకులు!

Update: 2026-03-12 08:17 GMT

Hansika Motwani’s Marriage Ends: నటి హన్సిక మోత్వానీ, సోహైల్ ఖతూరియా తమ రెండేళ్ల వివాహ బంధానికి చట్టబద్ధంగా ముగింపు పలికారు. గత ఏడాది కాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని, విడిపోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ హన్సిక ఎప్పుడూ స్పందించలేదు. అయితే, తాజాగా బాంద్రా కోర్టు వీరికి విడాకులు మంజూరు చేయడంతో ఈ వార్తలు నిజమని తేలిపోయింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

భరణం వద్దన్న హన్సిక!

ఈ విడాకుల సెటిల్‌మెంట్‌లో భాగంగా హన్సిక తన భర్త నుంచి ఎటువంటి భరణం (Alimony) ఆశించలేదని తెలుస్తోంది. కేవలం ప్రశాంతంగా విడిపోవాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం. పెళ్లయిన కొద్దిరోజులకే వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయని, చిన్న చిన్న విషయాలకే పెద్ద ఎత్తున గొడవలు జరిగేవని కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఒకరితో ఒకరు కలిసి ఉండటం కష్టమని భావించి, విడిపోవడమే ఇద్దరికీ మంచిదని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

2022లో గ్రాండ్ వెడ్డింగ్..

హన్సిక మరియు సోహైల్ 2022 డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని జైపూర్‌లో అత్యంత వైభవంగా వివాహం చేసుకున్నారు. చిన్ననాటి స్నేహితులైన వీరిద్దరి పెళ్లి వేడుక అప్పట్లో ఒక హాట్ టాపిక్. వీరి పెళ్లికి సంబంధించిన వీడియోలు కూడా ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అయ్యాయి. ఇంతటి గ్రాండ్ వెడ్డింగ్ చేసుకున్న ఈ జంట కేవలం మూడేళ్లు కూడా గడవకముందే విడిపోవడం అభిమానులను కలచివేస్తోంది. వీరికి సంతానం లేదు.

Tags:    

Similar News