'Hanuman 3D Jathara': జూన్ 25న హనుమాన్ 3D జాతర.. హైదరాబాద్‌లో ఘనంగా ట్రైలర్ లాంచ్..

ట్రైలర్ లాంచ్..

Update: 2026-06-22 07:58 GMT

'Hanuman 3D Jathara': యువ హీరో తేజ సజ్జ, ప్రశాంత్ వర్మల కాంబినేషన్‌లో వచ్చిన పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ హనుమాన్ 2Dలో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రేక్షకులకు మరింత అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు ఈ చిత్రాన్ని 3D వెర్షన్‌లో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ముఖ్య అతిథిగా హాజరై, ట్రైలర్‌ను విడుదల చేశారు.

చివరి 20 నిమిషాలు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది" – సాయి దుర్గా తేజ్

ట్రైలర్ విడుదల చేసిన అనంతరం సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ.. "హనుమాన్ 3D ట్రైలర్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. తెలుగు ప్రేక్షకులకు బెస్ట్ టెక్నాలజీ ఇవ్వాలనే నిర్మాతల ప్యాషన్ అభినందనీయం. ఈ సినిమాలో చివరి 20 నిమిషాలు చూస్తుంటే సాక్షాత్తూ ఆ హనుమంతుడిని ప్రత్యక్షంగా చూసినట్లు ఉంటుంది. ఆ సీన్స్ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. జూన్ 25న ఫ్యామిలీతో కలిసి ఈ థ్రిల్‌ను మిస్ అవ్వకండి" అని పేర్కొన్నారు.

ఈవెంట్‌లోని ముఖ్య విశేషాలు..

తేజ సజ్జ ఎమోషనల్ స్పీచ్:

"నేను కూడా మీతో పాటే ఫస్ట్ టైమ్ 3D ట్రైలర్ చూశాను, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇలాంటి దైవికమైన సినిమాలో నటించే అవకాశం రాదు. ఈ టీమ్‌ను మళ్లీ కలవడం రీయూనియన్‌లా ఉంది" అని హీరో తేజ సజ్జ ఆనందం వ్యక్తం చేశారు.

600 మంది టెక్నీషియన్ల శ్రమ:

దాదాపు 600 మంది సాంకేతిక నిపుణులు రాత్రింబగళ్లు మూడు నెలల పాటు శ్రమించి ఈ 3D వెర్షన్‌ను అత్యుత్తమ నాణ్యతతో సిద్ధం చేశారని 3D కిరణ్ వెల్లడించారు.

కృతజ్ఞతగా 3D వెర్షన్:

2Dలో సినిమాను అంతగా ఆదరించిన ప్రేక్షకులకు రిటర్న్ గిఫ్ట్‌గా, సరికొత్త అనుభూతిని పంచాలనే ఆలోచనతోనే భారీ ఖర్చుతో ఈ 3D వెర్షన్‌ను రెడీ చేసినట్లు నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి తెలిపారు.

థియేటర్లలో సరికొత్త అనుభూతి..

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రంలో హీరోయిన్ అమృత అయ్యర్, సంగీత దర్శకుడు గౌర హరి కూడా పాల్గొని జూన్ 25న థియేటర్లలో హనుమాన్ 3D సృష్టించబోయే విజువల్ వండర్ కోసం తాము కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. భారీ గ్రాఫిక్స్, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అలరించిన ఈ చిత్రం 3D గ్లాసెస్ పెట్టుకుని చూస్తుంటే ప్రేక్షకులకు ఏ రేంజ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందో చూడాలి..

Tags:    

Similar News