Hari Hara Veera Mallu: పుష్ప రికార్డును బ్రేక్ చేసిన హరిహర వీరమల్లు
రికార్డును బ్రేక్ చేసిన హరిహర వీరమల్లు;
Hari Hara Veera Mallu: పవర్ స్టా్ర్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు', క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. బాబీ దేవోల్, అనుపమ్ఫేర్, సత్య రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే తాజాగా రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ సరికొత్త రికార్డు సృ ష్టించింది. విడుదలైన కొన్ని గంటల్లోనే మి లియన్ల వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సౌత్ ఇండియాలో ఇప్పటివరకు ఐకాన్స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ట్రైలర్ (44.67 మిలియన్ వ్యూస్) టాప్ లో ఉండగా.. దానిని హరిహర వీర మల్లు బ్రేక్ చేసింది. తెలుగులో కేవలం 24 గంటల్లోనే 48 మిలియన్ వ్యూస్ (అన్ని భాషల్లో కలిపి 61.7 మిలయన్ల వ్యూస్) సొంతం చేసుకుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా పవన్ ఫ్యాన్స్ రెచ్చి పోతున్నారు. 'ఆల్ టైమ్ రికార్డ్ ' హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఇందులో పవర్ ఫుల్ వీరమల్లుగా యోధుడి పాత్రలో తన డైలాగులతో పవన్ ఆకట్టుకుంటున్నాడు. ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పో సుకుంటున్న సమయం అంటూ ప్రారంభమైన ఈ ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. సుమారు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకం పై దయాకర్ నిర్మిస్తున్నాడు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆయన సంగీతం సినిమాకు ప్రాణం పోస్తుందని, ముఖ్యంగా నేపథ్య సంగీతం సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూరుస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు మాటల్లో చెప్పలేం. ఈ చిత్రాన్ని జులై 24న విడుదల చేయనున్నారు.