Telugu Cinema: హరిహర వీరమల్లు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా?
హరిహర వీరమల్లు.. ప్రీ రిలీజ్ ఈవెంట్;
Telugu Cinema: పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రం హరి హర వీరమల్లు. క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించారు. . మొదటి భాగానికి హరిహర వీరమల్లు: Part 1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అని పేరు పెట్టగా.. భారీ అంచనాల నడుమ జూన్ 12న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై ఓ కీలక అప్ డేట్ బయటకొచ్చింది. జూన్ 8వ తేదీన తిరుపతిలోని SVU తారకరామ గ్రౌండ్ లో చాలా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారని తెలుస్తోంది. జూన్ 7వ తేదీన పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకొని.. తిరుమల శ్రీవారిని దర్శనం అనంతరం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరు కానున్నారని సమాచారం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవానికి ముందుగా హరిహర వీరమల్లు సినిమాను మార్చి 28న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పవన్ బిజీగా ఉండడం, డేట్స్ విషయంలో గందరగోళం నెలకొనడంతో షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. దీంతో మేకర్స్ రిలీజ్ డేట్ ను కూడా మార్చేశారు. తాజాగా పవన్‌కు సంబంధించిన సన్నివేశాలను షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి ఫైనల్ రిలీజ్ డేట్ జూన్ 12 అని ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం డబ్బింగ్ కంప్లీట్ చేశారు. ఏకధాటిగా నాలుగు గంటల్లో పూర్తి చేయడం విశేషం.